News February 18, 2025
MNCL: దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి చర్యలు: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం మంచిర్యాలలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో అర్హులైన దివ్యాంగుల ఎంపిక కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. దివ్యాంగ శాతం, అర్హతను బట్టి అవసరమైన సహాయ ఉపకరణాలు అందిస్తామన్నారు.
Similar News
News April 16, 2026
వీళ్లూ ITR ఫైల్ చేయాల్సిందే!

ITR ఫైల్ చేయడం ఆదాయంపైనే ఆధారపడి ఉండదు. కొన్ని రకాల ఖర్చులు లేదా లావాదేవీలు పరిమితి దాటితే తప్పనిసరి. *సేవింగ్స్ అకౌంట్‌లో ₹50 లక్షలు, కరెంట్ అకౌంట్‌లో ₹కోటి డిపాజిట్ చేస్తే. *ఏడాదికి కరెంటు బిల్లు ₹లక్ష దాటితే. *బిజినెస్ టర్నోవర్ ₹60 లక్షలు దాటితే. *ప్రొఫెషనల్ ఇన్కమ్ ₹10 లక్షల పైన ఉంటే. *TDS లేదా TCS రూపంలో ₹25 వేలు అంతకంటే ఎక్కువ కట్ అయితే ఆదాయం పన్ను పరిమితిలో లేకపోయినా ITR ఫైలింగ్ తప్పనిసరి.
News April 16, 2026
వనపర్తి: 3,897 మంది రైతులకు రూ.30.02 కోట్ల రుణమాఫీ

గోపాల్ పేట మండలంలో 3,897 మంది రైతులకు గాను మొత్తం రూ.30.02 కోట్ల రుణమాఫీ చేసినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. అదేవిధంగా 12,637 మంది రైతులకు గాను 23,275 ఎకరాలకు రూ.13.96 కోట్ల పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను అందించామన్నారు. మండలంలో మొత్తం 10,534 రేషన్ కార్డులు ఉండగా.. వాటిలో కొత్తగా 962 రేషన్ కార్డులు జారీ చేసినట్లు ఆయన వివరించారు.
News April 16, 2026
HYD: ఫైర్ యాక్సిడెంట్స్.. ఇలా చేయండి!

HYDలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలూ బాధ్యతగా వ్యవహరించాలని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు సూచించారు. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ భవనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫైర్ అలారం రూ.800- రూ.3,000, స్మోక్ డిటెక్టర్ రూ.1200-1500, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ రూ.3,000 వరకు లభిస్తాయని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించొచ్చని వివరించారు.


