News January 30, 2025

MNCL: నిప్పంటించుకన్న వ్యక్తి మృతి

image

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మైలగాని శంకర్ అనే చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై దివాకర్ తెలిపారు.

Similar News

News February 10, 2025

కావలి: కస్తూర్బా ఘటనపై హోంమంత్రి అనిత ఆరా!

image

కావలి రూరల్ మండలం ముసునూరు శివారు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి అనిత కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. విద్యాలయం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందొద్దని మంత్రి కోరారు.

News February 10, 2025

పెళ్లి చేసుకున్న నటి

image

మలయాళీ నటి పార్వతి నాయర్ పెళ్లి చేసుకున్నారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌ను ఆమె వివాహమాడారు. ఈ క్రమంలో ఆ జంటకు విషెస్ చెబుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పాపిన్స్, నిమిరిందు నిల్, ఎన్నై అరిందుల్(ఎంతవాడు గానీ), ఉత్తమ విలన్, ఓవర్ టేక్ వంటి సినిమాల్లో ఆమె నటించారు.

News February 10, 2025

జగిత్యాల: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

image

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 20 ZPTCలు, 216 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

error: Content is protected !!