News February 10, 2025
MNCL: నేటి నుంచి పలు రైళ్లు రద్దు

మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని సిర్పూర్ కాగజ్ నగర్, రెబ్బెన, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దయ్యాయి. ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News September 17, 2025
పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం: Dy.CM భట్టి

ఖమ్మం: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొనసాగుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతాంగం, కూలీలు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.
News September 17, 2025
వెలగపూడి: బీసీ రక్షణ చట్టంపై మంత్రి అనగాని సమీక్ష

బీసీల రక్షణ కోసం చట్టం రూపొందించడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలపై సహచర మంత్రులతో ఆయన చర్చించారు. బీసీల హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
News September 17, 2025
హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.