News February 10, 2025
MNCL: నేటి నుంచి పలు రైళ్లు రద్దు

మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని సిర్పూర్ కాగజ్ నగర్, రెబ్బెన, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దయ్యాయి. ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News March 25, 2025
మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు

పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన నితిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి శ్రీధర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి తానున్నానని భరోసా కల్పించారు. ‘సార్.. నేను మంచి క్రికెటర్ కావాలనుకున్నా, క్రికెట్ కిట్ ఇప్పించండి’ అని నితిన్ అనడంతో శ్రీధర్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రికెట్ కిట్ తెప్పించి అతడి కోరికను తీర్చారు.
News March 25, 2025
‘NGKL జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలి’

NGKL తెలంగాణ స్కిల్ అకాడమీ అండ్ ట్రైనింగ్ (T SAT ) ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్, జిల్లా నేతలు కాటిక రామస్వామి, ప్రజా గాయకుడు వేపూరి సోమన్న కలిశారు. యువతకు, విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందించడంపై ఇచ్చే శిక్షణలో జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. టీశాట్ ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా యువతకు తగిన ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.