News April 15, 2025

MNCL: నేటి నుంచి యూడైస్ ప్లస్ సర్వే

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 600 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 60 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.

Similar News

News January 6, 2026

ఒమన్‌లో పెళ్లికి ముందు హెల్త్ చెకప్ తప్పనిసరి!

image

ఒమన్‌లో ఇకపై పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. జంటలో ఒకరు విదేశీయులైనా ఈ టెస్టులు కంపల్సరీ. జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం, హెపటైటిస్, HIV వంటి వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి లేదా పుట్టబోయే బిడ్డకు సోకకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. రిజల్ట్స్‌ను మూడో వ్యక్తికి చెప్పొద్దనే నియమం పెట్టారు.

News January 6, 2026

ఖేల్ ఇండియా క్రీడలకు ఎంపికలు సిద్ధమా?

image

ఖేల్ ఇండియా గిరిజన జాతీయ క్రీడా పోటీల కోసం ఈనెల 8న కాకినాడ క్రీడా మైదానంలో ఎంపికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పురుషులు, మహిళల ఓపెన్ ఏజ్ విభాగాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లా క్రీడా అధికారి వైకుంఠరావు మంగళవారం తెలిపారు. అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్ బాల్, స్విమ్మింగ్, హాకీ క్రీడల్లో రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేస్తారు.

News January 6, 2026

SRD: పేదరికంలో పుట్టి అంతర్జాతీయ గుర్తింపు!

image

పర్యావరణ పరిరక్షణ కోసం ఒక వినూత్న సాంకేతిక ప్రయోగం చేసి అంతర్జాతీయ గుర్తింపు (పేటెంట్) పొందారు సిర్గాపూర్ పటేల్ తండాకు చెందిన వెంకట్ నాయక్. పేదరికంలో పుట్టి పట్టుదలతో PHD సాధించారు. హైదరాబాద్లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. పర్యావరణం కాలుష్యం నుంచి కాపాడేందుకు వ్యర్థాలను వేరు చేసే ‘గార్బేజ్ కలెక్షన్ బిన్ ఆన్ వీల్స్’ రూపొందించగా, ఆయనకు భారత్ ప్రభుత్వం హక్కులు కల్పించింది.