News March 6, 2025

MNCL: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

Similar News

News October 22, 2025

పాల్వంచ: ఈనెల 24న జాబ్ మేళా..

image

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టెక్నీషియన్, ట్రైనీ టెక్నీషియన్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ లేదా ఐటీఐ చేసిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్ల లోపు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యా అర్హత పత్రాలతో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.

News October 22, 2025

థాంక్స్ చెబుతూనే మోదీ చురకలు!

image

దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పీఎం మోదీ <<18069464>>థాంక్స్ చెప్పిన <<>>విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధన్యవాదాలు చెబుతూనే ట్రంప్‌కు చురకలు అంటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఐక్యంగా వ్యతిరేకించాలంటూ ప్రధాని హితవుపలికారు. పాక్‌ను ట్రంప్ సపోర్ట్ చేస్తుండటాన్ని పరోక్షంగా గుర్తు చేశారని, ఇదే సమయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

News October 22, 2025

తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సూచనలు

image

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాగులు పొంగే చోట అధికారులు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.