News March 6, 2025
MNCL: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
Similar News
News March 23, 2025
గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతి హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.
News March 23, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాల్లో మార్పులు

తిరుపతి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగే సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సోమవారం 24వ తేది నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ మార్పును జిల్లా వాసులు గమనించాలని ఆయన కోరారు.
News March 23, 2025
హీరోయిన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ డేటింగ్?

సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తమిళ హీరోయిన్ బ్రిగిడా సాగాతో డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన భార్యతో దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల బ్రిగిడకు దగ్గరయ్యారని సినీ వర్గాలంటున్నాయి. ఈ పుకార్లపై వారు స్పందించాల్సి ఉంది. కాగా బ్రిగిడాతో శ్రీకాంత్ పెదకాపు-1 సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ సమయంలోనే వారి మధ్య స్నేహం చిగురించిందని సమాచారం.