News March 4, 2025
MNCL: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.
Similar News
News October 19, 2025
ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దగా చేశారు: వైసీపీ నేతలు

AP: ప్రభుత్వ <<18045253>>ఉద్యోగులను<<>> చంద్రబాబు మరోసారి దగా చేశారని వైసీపీ మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. 4 డీఏలు పెండింగ్లో ఉంటే ఒకటే చెల్లిస్తామని ప్రకటించారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. తమపై విమర్శలు తప్ప, కూటమి ప్రభుత్వం సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి చేయట్లేదన్నారు.
News October 19, 2025
సదాశివనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సదాశివనగర్ మండలం బొంపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. గాంధారి మండలానికి చెందిన అరవింద స్వామి ద్విచక్ర వాహనంపై సదాశివనగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 19, 2025
కరీంనగర్లో 22న జాబ్ మేళా.!

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.