News February 1, 2025

MNCL: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమంగా నిలవాలి: DEO

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేలా కృషి చేయాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ ఎయిడెడ్, తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించే గ్రాండ్ టెస్ట్, మార్చిలో నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలన్నారు.

Similar News

News November 15, 2025

NZB: గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని భావం సాహెబ్ పాడ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి బైక్‌పై 260 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.

News November 15, 2025

CSK నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

image

ఓపెనర్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్(CSK) వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కాన్వే ట్వీట్ చేశారు. మూడేళ్లు పాటు మద్దతుగా నిలిచిన CSK ఫ్యాన్స్‌కు Xలో ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్లో జెర్సీతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేశారు. ఐపీఎల్‌లో CSK తరఫున 29 మ్యాచులు ఆడిన కాన్వే 43.2 సగటుతో 1080 పరుగులు చేశారు. ఇందులో 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించారు.

News November 15, 2025

కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్: మంత్రి వివేక్

image

జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అని విమర్శించారు. ఆయన నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీష్ రావు తేల్చుకోవాలని సూచించారు.