News March 9, 2025

MNCL: పద్మ కుమార్‌కు ఉత్తమ మహిళా-ధాత్రి రత్న సేవా అవార్డు

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమం ప్రధాన కార్యదర్శి పద్మ కుమార్‌కు ఉత్తమ మహిళా-ధాత్రి రత్న సేవ అవార్డులు వరించింది. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్. ప్రియా చౌదరి ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. సమాజానికి అందిస్తున్న విశేష సేవలకు పద్మ కుమార్‌కు పురస్కారం అందజేశారు.

Similar News

News September 14, 2025

ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి: విజయ్

image

ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని సినీ హీరో, TVK చీఫ్ విజయ్ అన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి, ఎలక్షన్స్ పెట్టాలని BJP చూస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని మండిపడ్డారు. 500కుపైగా హామీలు ఇచ్చిన DMK ఎన్ని నెరవేర్చిందని ప్రశ్నించారు. కానీ CM స్టాలిన్ సిగ్గులేకుండా అన్నీ నెరవేర్చామని చెప్పుకుంటున్నారని అరియలూర్‌ రోడ్ షో‌లో ఫైరయ్యారు.

News September 14, 2025

GDK: లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం: జడ్జి

image

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందుతారని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని స్థానిక జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ లలో రాజీ కుదుర్చుకుంటే ఒకరు గెలిచి, మరొకరు ఓడినట్లు కాదన్నారు. రాజీ పడిన వివిధ కేసులను ఆయన కొట్టివేశారు.

News September 14, 2025

కరీంనగర్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

image

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ కోత్వాల్ రమేష్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు మోసాలు, ఏపీకే ఫైల్స్, సిమ్ కార్డుల దుర్వినియోగం, బ్యాంక్ ఖాతా సమాచారం, లింక్స్, పెట్టుబడుల మోసాలు, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్స్ వంటి నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.