News March 21, 2025
MNCL: పరీక్షకు 20 మంది గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఈఓ యాదయ్య తెలిపారు. 49 పరీక్షా కేంద్రాల్లో రెగ్యూలర్ విద్యార్థులు 9,183 మందికి గాను 9,163 మంది హాజరయ్యారని, 20 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. సప్లీలు రాసే ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు హాజరయ్యారు. కాగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 6, 2025
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స

ప్రసవ సమయంలో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన తీవ్ర రక్తస్రావం కావొచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా వేరుచేసే సమయంలో ఇది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించడం, రక్త మార్పిడి, ICUలో చికిత్స అవసరం కావచ్చు. గర్భాన్ని కొనసాగించాలంటే నిపుణుల పర్యవేక్షణ ఉండాలి. అవసరమైన ప్రత్యేక స్కాన్లు, పరీక్షలు చేయించుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాన్ని తొలగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News December 6, 2025
విజయవాడ: పనులు ఆలస్యం.. గడువు దాటినా మార్పు లేదు

గన్నవరం విమానాశ్రయంలో రూ. 170 కోట్లతో 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన నూతన టెర్మినల్ భవనం 30 నెలల్లో పూర్తికావాల్సి ఉండగా 68 నెలలు గడిచినా పనులు ముందుకుసాగడం లేదు. కేంద్ర మంత్రి 2 సార్లు పరిశీలించి హెచ్చరికలు చేసినా మార్పు లేక డిసెంబర్ గడువు కూడా దాటిపోయింది. ఇంకా కనీసం 6 నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. టెర్మినల్ ఆలస్యంతో బోయింగ్ సేవలు ప్రారంభం కావడం లేదు.
News December 6, 2025
గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.


