News March 21, 2025
MNCL: పరీక్షకు 20 మంది గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఈఓ యాదయ్య తెలిపారు. 49 పరీక్షా కేంద్రాల్లో రెగ్యూలర్ విద్యార్థులు 9,183 మందికి గాను 9,163 మంది హాజరయ్యారని, 20 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. సప్లీలు రాసే ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు హాజరయ్యారు. కాగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News April 23, 2025
పాకిస్థాన్‌కు భారత్ దెబ్బ?

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ, దౌత్యపరంగా పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా స్థావరాలపై దాడి
*ఆ దేశంతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం
*సింధు నదీజలాల ఒప్పందం రద్దు
*ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర గురించి భారత్ UN సెక్యూరిటీ ప్రతినిధులకు, 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టే యోచన.
News April 23, 2025
ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ క్లాస్‌లో ఎంతమంది పాసయ్యారంటే

ఎన్టీఆర్ జిల్లాలో టెన్త్ పరీక్షలు 27,467 మంది విద్యార్థులు రాయగా 23,534 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 19,589 మంది ఫస్ట్ డివిజన్‌లో, 2,782 మంది సెకండ్ డివిజన్‌లో, 1,163 మంది థర్డ్ డివిజన్‌లో పాసయ్యారని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా.KV శ్రీనివాసరెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
News April 23, 2025
2PM: HYDలో 78.57% పోలింగ్

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది. సాయంత్రం 4 గంటలను పోలింగ్ ముగియనుంది.