News March 2, 2025
MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: డీఈవో

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శనివారం ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లు, డెపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
Similar News
News October 28, 2025
నస్పూర్: టీచర్ అవతారమెత్తిన జిల్లా కలెక్టర్

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమారు దీపక్ అధ్యాపకుని అవతారం ఎత్తారు. నస్పూర్ మండలం కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినీలకు స్వయంగా పాఠాలు బోధించి ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని అధ్యాపకులకు సూచించారు.
News October 28, 2025
వరంగల్: ఆయనపై మంత్రి దామోదర చర్యలు ఉత్తవేనా..?

ఉత్తర తెలంగాణకు గుండెకాయలా ఉన్న వరంగల్ <<18099653>>ఎంజీఎం<<>> దుస్థితి నానాటికి దిగజారిపోతోంది. నేతలు కన్నెత్తి చూడకపోవడంతో అధికారులు మొద్దు నిద్ర పోతున్నారు. తాజాగా ఒకే సిలిండర్ ఇద్దరు చిన్నారులకు ఇచ్చిన ఘటనలో ఎంజీఎం <<18107035>>సూపరింటెండెంట్‌పై వేటు<<>> వేశారని మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్యలంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోజు వచ్చి ఆయన ఆఫీసులోనే ఉంటున్నారని తెలుస్తోంది.
News October 28, 2025
తుఫాన్ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం: VZM SP

మొంథా తుఫాన్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారని పేర్కొన్నారు. కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటేటప్పుడు ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని, ప్రజలకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


