News March 23, 2025
MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రశ్న, జవాబు పత్రాల రవాణా, బందోబస్తు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలకు వైద్య సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
Similar News
News December 1, 2025
కర్నూలు జిల్లా రైతులకు దిత్వా భయం

కర్నూలు జిల్లా రైతులను దిత్వా తుఫాను భయపెడుతోంది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగితే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చేస్తున్నారు. ఒక్క పెద్దకడబూరు మండల పరిధిలోనే సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం తుఫాను ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.
News December 1, 2025
NGKL: అరుణాచలం, కాణిపాకానికి ప్రత్యేక బస్సు

పౌర్ణమి పురస్కరించుకొని డిసెంబర్ 3న రాత్రి 8 గంటలకు అరుణాచలం గిరిప్రదర్శన కు నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈనెల 4వ తేదీన ఉదయం కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, దర్శనం అనంతరం 5వ తేదీ అరుణాచలం గిరి ప్రదక్షిణ, దర్శనం ఉంటుందని తెలిపారు. వివరాలకు 9490411590, 9490411591, 7382827527ను సంప్రదించాలని కోరారు.
News December 1, 2025
NTR: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను అమరావతి భూసమీకరణ విధులలో భాగం చేసేందుకు CRDA సన్నద్ధమైంది. CRDAలో డిప్యూటీ కలెక్టర్లు(7), తహశీల్దార్(5), డిప్యూటీ తహశీల్దార్(5) ఉద్యోగాలకు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు DEC 2లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలని, ఇదే వెబ్సైట్లోని కెరీర్స్ ట్యాబ్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


