News January 7, 2025
MNCL: పరీక్షల షెడ్యూల్ విడుదల..!

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు- 2024.-25 పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్, 11న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12 నుంచి 16 వరకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు www.bsetelangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 13, 2025
పోలింగ్కు పగడ్బందిగా ఏర్పాట్లు: ఆదిలాబాద్ కలెక్టర్

ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సాత్నాల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. తహశీల్దార్ జాదవ్ రామారావు, ఎంపీడీవో వెంకట రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News December 13, 2025
ఆదిలాబాద్: ‘బెదిరింపులకు పాల్పడితే చెప్పండి’

తినే పదార్థాలు తయారు చేసే యజమానులు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత రంగులు వాడకూడదని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో సురక్షిత ఆహారం, ఆరోగ్యంపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వస్తువులను వినియోగదారులు పరిశీలించి కొనాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమను సంప్రదించాలన్నారు. అధ్యక్షుడు దినేష్ ఉన్నారు.
News December 12, 2025
8 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికలు ఈ నెల 14న ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేలా, జైనథ్, సాత్నాల, భోరాజ్, తాంసీ, భీంపూర్ మండలాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు.


