News January 24, 2025
MNCL: పీఎంశ్రీ నిధులు సక్రమంగా వినియోగించాలి

జిల్లాలో ఎంపిక చేయబడిన 25 పాఠశాలల్లో పీఎం శ్రీ నిధులను సక్రమంగా వినియోగించాలని డీఈఓ యాదయ్య అన్నారు. మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పీఎం శ్రీ పథకంతో పాఠశాలల మహర్దశ పడుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు తీర్మానం ద్వారా నిధులు సక్రమంగా వినియోగించి విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలని సూచించారు.
Similar News
News November 6, 2025
కళాశాలలను తనిఖీ చేసిన డీఐఈఓ శ్రీధర్ సుమన్

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు, రికార్డుల నిర్వహణలో ఇంటర్ బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని DIEO శ్రీధర్ సుమన్ సూచించారు. ఖానాపూర్ మోడల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేట ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ కళాశాలలను DIEO తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ అభ్యసన తరగతులు నిర్వహించాలన్నారు.
News November 6, 2025
మెట్‌పల్లి: రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: అదనపు కలెక్టర్

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ లత సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వాతావరణ మార్పు దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ అన్నారు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఎమ్మార్వో, ఏపీఎం, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
News November 6, 2025
ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <


