News March 21, 2025
MNCL: పుట్టెడు దుఃఖంలోనూ పది పరీక్ష రాసింది..!

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో పరీక్షాకేంద్రానికి వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని శ్రీలత. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తాపూర్‌కు చెందిన మంచర్ల మల్లయ్య(62) గురువారం రాత్రి చనిపోయారు. ఆయన కూతురు శ్రీలత బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసొచ్చింది. దుఃఖంలోనూ పరీక్ష రాసిన ఆమె ఎంతో గ్రేట్ కదా..!
Similar News
News April 5, 2025
HYD: ఆ బస్సుల్లోనూ మహిళలకు FREE..!

HYDలో అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు లగ్జరీగా ఉండడంతో కొందరు ప్రయాణికులు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం కిందకి రాదని అపోహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బస్సులపై మహాలక్ష్మి FREE పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటించారు.
News April 5, 2025
ALERT: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో ఎండలు కాస్తాయని తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నెలకొంటుందని పేర్కొంది. TGలోని ఉమ్మడి MBNR, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News April 5, 2025
మధిర: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర-తొండల గోపురం రైల్వేస్టేషన్ మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన గడ్డం మహేశ్వరరావు మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.