News December 3, 2024
MNCL: పెళ్లైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య

పెళ్లైన 4నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఏసీసీలోని కృష్ణ కాలనీకి చెందిన అయిండ్ల రోషిణి కడుపు నొప్పి భరించలేక సోమవారం ఉదయం తల్లిగారింటి వద్ద మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి గత ఆగస్టులో బెల్లంపల్లికి చెందిన ప్రేమ్ కుమార్‌తో వివాహం జరిగింది. కాగా ఈ ఘటనపై ఎస్ఐ రాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 24, 2026
ADB: మేడారం మహా జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మేడారం మహా జాతరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో జాతరకు 369 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 24, 2026
ఆదిలాబాద్ జైలు సూపరింటెండెంట్ బదిలీ

ఆదిలాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. 2021లో బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగున్నరేళ్ల పాటు పారదర్శక సేవలు అందించారు. జైలు ప్రాంగణంలో పెట్రోల్ బంక్, అడ్వాన్స్‌డ్ వెహికల్ వాష్, సోలార్ పార్కింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్‌తో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదని ఆయన పేర్కొన్నారు.
News January 24, 2026
ADB: నేటి నుంచి షో రూమ్‌లోనే బండి రిజిస్ట్రేషన్

నేటి నుంచి కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ పాయింట్ వద్దనే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహన యజమానులుా కానీ, వాహనాలు గానీ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ షోరూమ్ నుంచే అవసరమైన అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయన్నారు.


