News March 1, 2025
MNCL: పోలీస్ కమిషనరేట్‌కు 3 జాగిలాలు

రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు శనివారం 3 జాగిలాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కు చెందిన 3 జాగిలాలు పాసింగ్ ఔట్ పూర్తి చేసుకొని కమిషనరేట్‌కు వచ్చాయి. నేరాల నియంత్రణ, నార్కోటిక్, ఎక్స్‌ప్లోజివ్స్ గుర్తింపులో పోలీస్ జాగీలాల పాత్ర కీలకమని సీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
కొలనుపాక సోమేశ్వరాలయాన్ని దర్శించుకున్న కలెక్టర్

ఆలేరు మండలంలోని కొలనుపాక ప్రాచీన దేవాలయమైన శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలుపి, దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News November 5, 2025
బాపట్లలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు

ప్రైవేటు బస్సులు నడిపేవారు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాపట్ల వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి చెప్పారు. బాపట్ల పట్టణంలో పట్టణ పోలీసులతో కలిసి ప్రైవేటు బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎమర్జెన్సీ డోర్లను పరిశీలించారు. బస్సుల పత్రాలను పరిశీలించి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. బస్సులలో ఫైర్ సేఫ్టీ సిలిండర్ అందుబాటులో ఉంచుకోవాలని పరిమితికి మించి వేగంగా ప్రయాణించవద్దని సూచించారు.
News November 5, 2025
అయిజ: ఇంటర్నేషనల్ రన్నింగ్‌లో నడిగడ్డ వాసి ఫస్ట్

ఇంటర్నేషనల్ రన్నింగ్‌లో గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ మొదటి స్థానంలో నిలిచాడు. 42 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ రన్నింగ్ పోటీలు నేపాల్ రాష్ట్రంలో జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొన్న హరికృష్ణ సునాయాసంగా 42 కిలోమీటర్లు రన్నింగ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. నడిగడ్డ వాసికి మొదటి స్థానం దక్కడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


