News March 21, 2025
MNCL: ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యం: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం రోడ్డు సేఫ్టీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో పోలీస్, ట్రాఫిక్, ఇతర అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్స్ సందర్శించాలని, ప్రమాదాలకు సంబందించిన కారణాలు గుర్తించి వాటి నివారణకు కృషి చేయాలని సూచించారు. రోడ్లపై రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News March 24, 2025
ఆందోళన వద్దు.. ఆదుకుంటాం: సీఎం

AP: అకాల వడగండ్ల వర్షాల కారణంగా పంట నష్టపోయి అనంతపురం(D)లో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. దీంతో ప్రభుత్వ పరంగా వారికి సాయం అందించాలని CM ఆదేశించారు. నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందొద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
News March 23, 2025
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ భవన్ నందు ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షునిగా విద్యాసాగర్, సెక్రెటరీగా చంద్రమోహన్, కోశాధికారిగా సంధ్యా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై రాజు లేని పోరాటాలు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.
News March 23, 2025
కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు: KTR

TG: ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా CM రేవంత్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండేదని రైతులు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై అసూయ, ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే అని ఆరోపించారు.