News April 4, 2025
MNCL: ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరం: DEO

వృత్యంతర శిక్షణ ప్రతి ఉద్యోగికి అత్యవసరమని, నూతన అంశాలు నేర్చుకొని విజ్ఞానాన్ని నవీకరించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని DEO ఎస్ యాదయ్య అన్నారు. మంచిర్యాలలోని గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్న 2 రోజుల శిక్షణ శిబిరానికి గురువారం ఆయన హాజరై మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు నాయకులని, వారి నాయకత్వ లక్షణాలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నితీశ్

కొత్తగా కొలువుదీరిన బిహార్ క్యాబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపులు పూర్తయ్యాయి. 20 ఏళ్లుగా తన వద్దే ఉంచుకున్న కీలకమైన హోం శాఖను సీఎం నితీశ్ కుమార్ వదులుకున్నారు. డిప్యూటీ సీఎం చౌధరి(BJP)కి ఇచ్చారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా(BJP)కు రెవెన్యూ, గనుల శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, విజిలెన్స్ వంటి శాఖలు మాత్రమే నితీశ్ తన వద్ద ఉంచుకున్నారు.
News November 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 22, 2025
నవంబర్ 22: చరిత్రలో ఈ రోజు

1913: ఆర్థికవేత్త, ఆర్బీఐ 8వ గవర్నర్ లక్ష్మీకాంత్ ఝా జననం
1963: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం
2006: భారత మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం
2016: సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం (ఫొటోలో)


