News April 4, 2025
MNCL: ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరం: DEO

వృత్యంతర శిక్షణ ప్రతి ఉద్యోగికి అత్యవసరమని, నూతన అంశాలు నేర్చుకొని విజ్ఞానాన్ని నవీకరించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని DEO ఎస్ యాదయ్య అన్నారు. మంచిర్యాలలోని గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్న 2 రోజుల శిక్షణ శిబిరానికి గురువారం ఆయన హాజరై మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు నాయకులని, వారి నాయకత్వ లక్షణాలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2025
ఉక్రెయిన్ ఆరోపణలు నిరాధారం: చైనా

రష్యాకు తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామని ఉక్రెయిన్ చేసిన ఆరోపణలు నిరాధారమని చైనా స్పష్టం చేసింది. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. సీజ్‌ఫైర్ రావాలనే మేం కోరుకుంటున్నాం. యుద్ధాన్ని త్వరగా ముగించి శాంతి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలకూ చెబుతున్నాం. అలాంటిది రష్యాకు మేం ఎందుకు ఆయుధాలు సరఫరా చేస్తాం? అవి అర్థంలేని ఆరోపణలు’ అని పేర్కొంది.
News April 18, 2025
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తా.. కేసులకు భయపడను: భూమన

AP: SV గోశాలలో ఆవుల మృతిపై మాట్లాడినందుకు తన మీద <<16135353>>కేసులు పెట్టడంపై<<>> టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. వ్యక్తిత్వ హననం చేస్తే తాను వెనక్కి తగ్గుతాననుకుంటే అది వారి భ్రమ అని పేర్కొన్నారు. ఈ 10 నెలల కాలంలో టీటీడీ అప్రదిష్టపాలైందని విమర్శించారు.
News April 18, 2025
సారంగాపూర్: యాక్సిడెంట్.. ఒకరి మృతి

సారంగాపూర్ మండలం ధని శివారులో బైక్ ఢీకొట్టడంతో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ధని, జామ్ గ్రామాల మధ్య మతిస్థిమితం లేని వ్యక్తి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న నిశాంత్, గణేశ్‌కు గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే 8712659516ను సంప్రదించాలని సూచించారు.