News February 11, 2025

MNCL: ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్లు: CP

image

సైబర్ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఆదేశాల మేరకు కమిషనరేట్‌లో ప్రత్యేక దృష్టి సారించినట్లు జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. CP మాట్లాడుతూ.. సైబర్ నేరానికి గురైతే కంగారు పడకుండా ఫోన్ కాల్ చేస్తే సైబర్ వారియర్ అందుబాటులోకి వస్తారన్నారు. సైబర్ వారియర్స్ 1930ఫోనులో ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. నేరాన్ని నివేదించడం, అనుమానిత ఐడెంటిఫైయర్లను విశ్లేషించడం జరుగుతుందన్నారు.

Similar News

News October 28, 2025

విజయవాడ: ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

image

మైనార్టీ యువతీ యువకులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించిన 21-30 ఏళ్ల మధ్య వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీ వరకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జర్మన్ భాషలో శిక్షణ అందిస్తారు.

News October 28, 2025

విశాఖ రానున్న మంత్రి గొట్టిపాటి

image

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం సాయంత్రం నగరానికి రానున్నారు. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. అనంతరం నగరంలోని పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మెరుగైన సేవలు అందించేందుకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

News October 28, 2025

కోస్తాంధ్ర కలెక్టర్లకు హోం మంత్రి ఫోన్

image

మొంథా తుఫాను ప్రభావం వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. మంగళవారం ఉదయం కోస్తాంధ్ర జిల్లాలోని కలెక్టర్లతో ఆమె నేరుగా మాట్లాడారు. తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఏకైక లక్ష్యమని చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.