News March 5, 2025

MNCL: ‘ప్రాథమిక విద్య భవిష్యత్తుకు పునాది’

image

ప్రాథమిక విద్య అనేది ప్రతి వ్యక్తి భవిష్యత్తుకు పునాది లాంటిదని DEO యాదయ్య అన్నారు. మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో నూతన ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి ఉన్నత చదువులకు అనుగుణంగా తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

Similar News

News November 1, 2025

తిరుపతి: ఎకరాకు 3 బస్తాల యూరియా

image

తిరుపతి జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, అధికారులతో సమీక్షించారు. యూరియా కార్డుల ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు 3బస్తాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.

News November 1, 2025

సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని 37 పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కుంగ్ ఫు, జోడో, కలర్ కలరిపయట్టు నేర్పించే ఏజెన్సీలు ఈనెల 3వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని రెండో అంతస్తులో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ఎంపికైన వారు విద్యార్థులకు కరాటే నేర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

News November 1, 2025

JEE మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. <>jeemain.nta.ac.in<<>> వెబ్‌సైట్‌లో ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. JEE మెయిన్ రెండు సెషన్లలో జరగనుంది. ఫస్ట్ సెషన్ జనవరి 21, 30 తేదీల మధ్య, రెండో సెషన్ ఏప్రిల్ 1, 10 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. బీఈ, బీటెక్, B. Arch, B. Planning కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.