News April 11, 2025
MNCL: ఫూలే జయంతి ఉత్సవాలకు సింగేరేణి నిధులు

సింగరేణివ్యాప్తంగా శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు యాజమాన్యం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సంస్థ సీఅండ్ఎండీ బలరామ్ ఆదేశాల మేరకు జీఎం (వెల్ఫేర్) పర్సనల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు రూ.25 వేలు, జైపూర్ లోని ఎస్టీపీపీకి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేశారు.
Similar News
News February 26, 2026
పార్వతీ దేవి ఒడిలో పరమశివుడు.. ఈ దృశ్యం మరెక్కడా చూడలేరు!

సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. కానీ తిరుపతికి 75kms దూరంలోని సురుటుపల్లిలో ‘పళ్లికొండేశ్వర స్వామి’గా మానవ రూపంలో కొలువై ఉన్నాడు. క్షీరసాగర మథనంలో హాలాహలం మింగిన శివుడు కాస్త అస్వస్థతకు లోనై పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఇక్కడ విగ్రహం ఉంటుంది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..
News February 26, 2026
లడ్డూపై చర్చకు రెడీ: పయ్యావుల

AP: తిరుమల లడ్డూ అంశంపై శాసన మండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. ‘లడ్డూ అంశంపై దేవదాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే YCP సభ్యులు అడ్డుతగలడం సరికాదు. కేవలం సభకు రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి మీద వేయాలనే ధోరణితో వస్తున్నారు. తర్వాత వాక్ అవుట్ చేసి పోతున్నారు. YCP వాక్ అవుట్ పార్టీగా మారిపోయింది’ అని ఎద్దేవా చేశారు.
News February 26, 2026
మెదక్ జిల్లా పోలీస్ శాఖకు రెండు పెట్రోల్ బంకులు: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) నుంచి రెండు పెట్రోల్ బంకులు మంజూరైనట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. వీటిలో ఒకటి శంకరంపేట్(ఆర్) మండల కేంద్రంలో, మరొకటి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన(ఆవుసులపల్లి) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శంకరంపేట్(ఆర్)లో బంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగతావి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.


