News January 3, 2025
MNCL: ‘బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం’

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదామని CP శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ పరిధి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం CP సమీక్ష నిర్వహించారు. CP మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31వ వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్-Xlను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రతి ఒక్క అధికారి ముగ్గురు పిల్లలను కాపాడాలని సూచించారు.
Similar News
News November 18, 2025
ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.