News February 8, 2025
MNCL: భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంచిర్యాల జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 20, 2025
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.
News November 20, 2025
తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.
News November 20, 2025
జగిత్యాల జిల్లాకు జీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు అధికారులను నియమించింది. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడినిగా పి. వెంకట్ రెడ్డిని, వ్యయ పరిశీలకుడినిగా ఎం. మనోహర్ను నియమిస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


