News February 8, 2025
MNCL: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంచిర్యాల జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
SRD: అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన మహిళ

జహీరాబాద్ మున్సిపల్‌లో జరిగిన ఎన్నికల్లో అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఒక మహిళ తమ ఓటు హక్కును అంబులెన్స్‌లో వచ్చి వినియోగించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించలేని పరిస్థితిని గమనించిన ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అంబులెన్స్‌లో ఓటు వేసేలా సౌకర్యం కల్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటు వేయాలనే తపనతో వచ్చిన ఆమెను ఆర్డీవో అభినందించారు.
News February 12, 2026
టీచర్ లేకుండా ఎలా పాసవ్వాలి.. విద్యార్థుల ఆవేదన

కోడుమూరు జడ్పీ బాలుర పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు కాళీ ఏర్పడింది. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సైన్స్ టీచర్ లేకపోవడంతో ఏ విధంగా పరీక్షలకు సిద్ధం కావాలో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సైన్స్ టీచర్‌ను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.


