News March 19, 2025
MNCL: భారమంతా.. బడ్జెట్పైనే..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై మంచిర్యాల జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో జిల్లాలోని మందమర్రి మండలం గాంధారి ఖిల్లా, జన్నారం మండలం కవ్వాల్ టైగర్ రిజర్వ్, జైపూర్ మండలం శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం, దండేపల్లి మండలం గూడెంగుట్ట సత్యనారాయ స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Similar News
News October 16, 2025
బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.
News October 16, 2025
ADB: కొత్తవారికే హస్తం పగ్గాలు..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు డీసీసీ అధ్యక్ష పదవుల నియామకం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. కొత్త వారికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం యోచిస్తుండటంతో, పదవుల్లో కొనసాగుతున్న పాత నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్గ పోరు, ఆశావహుల సంఖ్య పెరగడంతో ఏకాభిప్రాయం కష్టంగా మారింది. ఈ అంశంపై ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటిస్తూ, నేతల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
News October 16, 2025
KNR: మారనున్న స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు BC రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పేరుతో దాదాపుగా రిజర్వేషన్లలో మార్పు తెచ్చింది. అయితే ఇటీవల కలిసొచ్చిన రిజర్వేషన్లతో అవకాశం ఉన్న ఆశావహులు ఇప్పటికే ఖర్చు పెడుతున్నారు. కానీ 50% నిబంధనతో మళ్లీ రిజర్వేషన్లు మారుతాయని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,216 GPలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.