News March 25, 2025
MNCL: ‘భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు’

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో ఆర్డీఓ శ్రీనివాస్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Similar News
News November 27, 2025
గంజాయి కేసులో ఐదుగురికి జైలు శిక్ష: VZM SP

డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని విజయనగరం ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సమర్పించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
News November 27, 2025
ములుగు: ఎన్నికల సమాచారం కోసం టీ-పోల్ యాప్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సమాచారాన్ని అందించేందుకు టీ-పోల్ మొబైల్ యాప్ అందుబాటులో ఉందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు, నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించాలని కోరారు. జిల్లాలోని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
News November 27, 2025
లక్ష్మీ నరసింహ స్వామి సేవలో నటుడు రాజీవ్ కనకాల

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామిని గురువారం సినీ నటులు రాజీవ్ కనకాల, బెల్లంకొండ ప్రవీణ్, జబర్దస్త్ అశోక్ దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ ఈఓ నాగ వరప్రసాద్ వారికి స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.


