News January 25, 2025

MNCL: మద్యం తాగి.. వాహనాలు నడిపిన నలుగురికి జైలు: ట్రాఫిక్ CI

image

ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 33 మందిని శుక్రవారం మంచిర్యాల సెకండ్ అడిషనల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి నిరోషా 29 మందికి రూ.65,500 జరిమానా, నలుగురికి 5 రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన సూచించారు.

Similar News

News December 6, 2025

దైవ ప్రసాదంతో ఈ తప్పులు వద్దు

image

ప్రసాదం ఆహారం మాత్రమే కాదు. అది దైవాశీర్వాదం కూడా! మిగిలిన ప్రసాదాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదు. ప్రసాదాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంచాలి. ఇతరులకు పంచాకే తినాలి. ప్రసాదం చెడిపోయే వరకు నిల్వ ఉంచకూడదు. ఒకవేళ అలా జరిగితే.. చెత్త బుట్టల్లో అస్సలు పడేయకూడదు. బదులుగా చెట్టు, మొక్కల మొదట్లో ఉంచాలి. తీర్థాలను కూడా కింద పారబోయరాదు. నేరుగా తాగరాదు. చేతిలోకి తీసుకున్నాకే స్వీకరించాలి.

News December 6, 2025

కాకర పంటను ఇలా సాగు చేస్తే మంచిది

image

కాకర పంటను పందిరి విధానంలో సాగు చేస్తే పంట నాణ్యతగా ఉండి, మార్కెట్లో మంచి ధర దక్కుతుంది. అలాగే దిగుబడి 40-50శాతం పెరుగుతుంది. కాకరను సారవంతమైన ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలల్లో మాత్రమే సాగు చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందిస్తే, ఎరువుల ఆదాతో పాటు, పెట్టుబడి కూడా కొంత తగ్గుతుంది. రసాయన పురుగు మందులే కాకుండా వేప ఉత్పత్తులతో కూడా చీడలను సంపూర్ణంగా నివారించి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.

News December 6, 2025

ఇవాళ మెగా జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరంజిల్లా రాజాంలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన, 18- 40ఏళ్ల వయసు గలవారు GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 35 MNCలు నిరుద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నాయి.