News January 25, 2025
MNCL: మద్యం తాగి.. వాహనాలు నడిపిన నలుగురికి జైలు: ట్రాఫిక్ CI

ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 33 మందిని శుక్రవారం మంచిర్యాల సెకండ్ అడిషనల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి నిరోషా 29 మందికి రూ.65,500 జరిమానా, నలుగురికి 5 రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన సూచించారు.
Similar News
News February 8, 2025
తిరుపతి: హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు బాంబు బెదిరింపులు

తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు శనివారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ‘అచ్చి ముత్తు సవుక్కు శంకర్’ అనే పేరుతో వచ్చిన మెయిల్ చూసిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 8, 2025
‘అఖండ-2’లో విలన్‌గా క్రేజీ యాక్టర్?

సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
News February 8, 2025
ఎద్దు దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి

నర్సీపట్నం మున్సిపాలిటీ బీసీ కాలనీలో బుధవారం జరిగిన ఎద్దు దాడిలో గాయపడ్డ గీశాల కన్నయ్య అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఎద్దు చేసిన దాడిలో కన్నయ్యకు కాలు, చెయ్యి విరిగిపోయాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని ఏరియా ఆసుపత్రి వైద్యులు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.