News March 29, 2024
MNCL: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాట్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ద షాక్, వాడు పోయిండు, వీడు పోయిండు అని ఒకటే ఊదరగొడుతుండ్రు.. ఇది శిశిర రుతువు.. పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలోకి పోతయ్.. మూలం మాత్రం స్థిరంగా ఉంటుంది. మళ్ళీ చైత్రం వస్తది. కొత్త ఆకులు చిగురిస్తాయి. మూలం నుంచి శక్తిని అందుకొని విజృంభిస్థాయి’ అన్నారు. ఇది ప్రకృతి సహజమని, ప్రతిదానికి షాక్ అయితే ఎలా అని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2026
పోలీసులకు వారాంతపు సెలవులపై చర్యలు తీసుకోవాలి: ADB SP

పోలీసులకు వారాంతపు సెలవులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎండాకాలం దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగడం, ఎండలో బయటకు వెళ్లే సందర్భంలో రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. త్వరలోనే సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమాలపై సమాచారం అందించిన సిబ్బందికి ప్రోత్సహిస్తామన్నారు.
News April 18, 2026
విధుల పట్ల అంకితభావంతో ఉండాలి: ADB SP

పోలీసు సిబ్బంది అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వహించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి మార్గదర్శనం చేశారు. యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని, ఎండాకాలం దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అరైవ్ అలైవ్ కృషిని అభినందిస్తూ.. రికార్డుల నవీకరణ, బాధితులతో మర్యాదపూర్వక ప్రవర్తన ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
News April 18, 2026
ఆదిలాబాద్: కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల భర్తీకి మున్సిపల్ కమిషనర్ జి.రాజు ప్రకటన విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ), అల్పసంఖ్యాక వర్గాల (Minorities) నుంచి ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ) ఎంపిక చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


