News January 28, 2025
MNCL: మెడికల్ కార్డు పొందేందుకు మరో అవకాశం

బొగ్గు గని రిటైర్డ్ కార్మికులకు మెడికల్ కార్డు పొందడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు జాతీయ సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం రాయపూర్‌లో జరిగిన 6వ బోర్డు సమావేశంలో కంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్‌ను మార్చి 31వరకు రూ.60వేల కంట్రిబ్యూషన్‌తో ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మెడికల్ కార్డు పొందని రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 7, 2025
విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.
News November 7, 2025
HYD నగరానికి ప్రతిష్ఠాత్మక అవార్డు!

తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. హైదరాబాద్ నగరం “సిటీ విత్ బెస్ట్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్” అవార్డు అందుకుంది. సుస్థిర నగర రవాణా విధానాలు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం చూపిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ విజయానికి టీజీ–రెడ్కో (TGREDCO) చేసిన కృషి కీలకమైంది.
News November 7, 2025
అధికారుల శాఖల వారిగా సమాచారాన్ని అందించాలి: కలెక్టర్

మొంథా తుఫాన్ కారణంగా ప్రజలకు, రైతులకు కలిగిన నష్టం గురించి శాఖల వారీగా అధికారులు నివేదికలు సమర్పించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన ఈనెల 8వ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించనున్న సమీక్ష కమిటీ సమావేశం నిర్వహణపై శుక్రవారం ఆయన అధికారులతో చర్చించారు. ప్రతి అధికారి వారి శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు


