News March 26, 2025
MNCL: రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలో రాజీవ్ యువ వికాస పథకం ద్వారా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పురుషోత్తం తెలిపారు. ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 5లోపు https:// tgobmmsnew. cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News September 16, 2025
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్‌ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.
News September 16, 2025
కిక్ బాక్సింగ్ పోటీల్లో సిరిసిల్ల విద్యార్థులకు వెండి పతకాలు

అస్మిత మహిళ కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వెండి పతకాలు సాధించారు. ఆదివారం వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్ బాక్సింగ్ లీగ్లో జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు పాల్గొనగా ఓల్డర్ కెడిట్- 37kgs point fight విభాగంలో శ్లోక, 42kgs point fight విభాగంలో లక్ష్మిప్రసన్న వెండి పతకాలు కొల్లగొట్టారు.
News September 16, 2025
GWL: స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలి- కలెక్టర్

ఎన్నికల సామగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. అక్కడ ఈవీఎంలకు సంబంధించిన రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షణ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక తహశీల్దార్ మల్లికార్జున్ పాల్గొన్నారు.