News February 4, 2025
MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్‌కు 3వ స్థానం

కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో రామగుండం పోలీస్ కమీషనరేట్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో మూడవ స్థానం లభించింది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు సోమవారం సీపీ ఎం. శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలవగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించడం పట్ల అభినందించారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News December 9, 2025
BREAKING: తూ.గో జిల్లాలో స్కూల్ పిల్లల బస్సు బోల్తా

తూ.గో జిల్లాలో తెల్లవారుజామున పెనుప్రమాదం తప్పింది. పెరవలిలోని తీపర్రు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడం వలనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
News December 9, 2025
వనపర్తి: గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థుల నానాతంటాలు

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు మటన్, మద్యం పంపిణీకి భారీగా ఖర్చు చేస్తున్నారు. హోటళ్ల వద్ద టీ, టిఫిన్లకు కూడా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు, నాయకులు శ్రమిస్తున్నారు.
News December 9, 2025
పెద్దపల్లి: ముగింపు దశకు మొదటి విడత ప్రచార పర్వం

పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంథని, కమాన్‌పూర్, రామగిరి, శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో 99 సర్పంచ్, 896 వార్డు మెంబర్ల ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల కోసం నాయకులు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. పలుచోట్ల అభ్యర్థులు సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.


