News February 2, 2025
MNCL: రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన జిల్లా విద్యార్థులు

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్, ఉపన్యాస పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా విద్యార్థులు ఎం.సంజన, ఎ.అభివర్థిని, ఎస్.అరవిందరాణి ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. శనివారం విద్యార్థులను డీఈఓ యాదయ్య అభినందించారు.
Similar News
News October 17, 2025
ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండప్

➤ రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఉద్యోగుల సమస్యలపై చర్చ
➤ కృష్ణా జిల్లాలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడపగా మార్చిన ప్రభుత్వం
➤ పిఠాపురం వర్మను జీరో చేశామని నేననలేదు. నా మాటలను వక్రీకరించారు: మంత్రి నారాయణ
➤ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ OCT 24కు పొడిగింపు
➤ న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డికి షరతులతో కూడిన అనుమతి జారీ చేసిన ఏసీబీ కోర్టు
News October 17, 2025
పెద్దపల్లి: TASK i4TY 2.0 ఐడియాథాన్కు విశేష స్పందన

TASK ఆధ్వర్యంలో ‘i4TY 2.0’ ఫిజికల్ ఐడియాథాన్ పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ థీమ్పై 3 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 210 మంది విద్యార్థులు 45 ఆవిష్కరణలు ప్రదర్శించారు. స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలు, డిజిటల్ ఐడియాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఆలోచనలకు మెంటర్షిప్, ఇంక్యుబేషన్ సపోర్ట్ అందించనున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు.
News October 17, 2025
నిజామాబాద్లో కానిస్టేబుల్ దారుణ హత్య

నిజామాబాద్లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ను ఓ దొంగ హత్య చేశాడు. ఓ కేసు విషయంలో అరెస్టు చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్ను వినాయక్ నగర్లో దొంగ రియాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. దీనిపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందుతుని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.