News January 23, 2025

MNCL: రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కు సన్మానం

image

తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం సాయంత్రం మంచిర్యాల కేంద్రంలో జన్నారం మండల టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ప్రతినిధులు సత్కరించారు. సత్కరించిన వారిలో మండల జర్నలిస్టులు నరసయ్య, మల్లేశం, లింగన్న, కిరణ్, వెంకటయ్య, సతీష్, రాజేందర్, శంకర్ తదితరులు ఉన్నారు.

Similar News

News October 18, 2025

కోతుల బెడద.. గ్రామస్థులు ఏం చేశారంటే..

image

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కూరెళ్లలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్యను తామే పరిష్కరించుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కరీంనగర్‌ నుంచి కోతులను బంధించే బృందాన్ని రప్పించాలని, ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.300 చెల్లించాలని గ్రామస్థులు సమావేశమై నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.1,000 చొప్పున ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించారు.

News October 18, 2025

అచ్చంపేట: చెంచులకు సామూహిక వివాహాలు

image

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26న చంద్రారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో చెంచులకు సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు కార్టులు వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవి హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు.

News October 18, 2025

వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా అనంతలక్ష్మి

image

వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన ఏలేటి అనంతలక్ష్మి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అనంతలక్ష్మి అన్నారు.