News January 24, 2025
MNCL: రేపు హ్యాండ్ బాల్ ఎంపికలు

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలను ఈనెల 25న ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేష్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే రెండు జిల్లాల క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
Similar News
News November 26, 2025
పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారు?

శుభకార్యాలు ప్రారంభించే ముందు పెరుగు, చక్కెర కలిపి తింటారు. ఇలా తింటే అదృష్టం వరిస్తుందన్న నమ్ముతారు. అయితే దీని వెనుక ఓ ఆరోగ్య రహస్యం ఉంది. ఇంటర్వ్యూ, పెళ్లి చూపులు, ఫస్ట్ డే ఆఫీస్కు వెళ్లినప్పుడు ఎవరికైనా ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. అయితే పెరుగుకు దేహాన్ని చల్లబరచే సామర్థ్యం, చక్కెరకు తక్షణ శక్తి అందించే లక్షణాలు ఉంటాయి. ఈ మిశ్రమం తీసుకుంటే టెన్షన్ తగ్గి, మనసు శాంతిస్తుంది. అందుకే తినమంటారు.
News November 26, 2025
ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు అప్లై చేశారా?

ఏపీ గ్రామీణ బ్యాంకులో 7 ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. వయసు 35 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.23,500, సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్కు రూ.30వేల చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://apgb.bank.in/
News November 26, 2025
‘ఉద్యాన రైతుల ఆదాయం పెరగాలి.. కార్యాచరణ రూపొందించండి’

AP: రాయలసీమలోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ఈ కార్యాచరణ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ కింద రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.


