News January 24, 2025

MNCL: రేపు హ్యాండ్ బాల్ ఎంపికలు

image

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలను ఈనెల 25న ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేష్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే రెండు జిల్లాల క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

Similar News

News February 19, 2025

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి నకిలీ పోలీస్

image

TG: కానిస్టేబుల్‌ని అంటూ ఓ వ్యక్తి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లోకి ప్రవేశించాడు. గోవర్ధన్ అనే అతను కానిస్టేబుల్ అని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అతణ్ని నమ్మించడానికి CM సమీక్ష జరుగుతున్నప్పుడే CCCలోకి వెళ్లి వచ్చాడు. ఆపై అతను కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు CCTV ఫుటేజ్ పరిశీలించగా నిందితుడి చిత్రాలు నమోదయ్యాయి.

News February 19, 2025

మోదీని కలిసిన రిషి సునాక్ ఫ్యామిలీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబ సమేతంగా కలిశారు. వారి వెంట సునాక్ అత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బ్రిటన్ మాజీ ప్రధాని ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

News February 19, 2025

మెదక్: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

image

ఉమ్మడిMDK- KNR- ADB- NZB, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

error: Content is protected !!