News January 4, 2025
MNCL: రైతుల ఖాతాల్లో రూ.111.24 కోట్లు జమ

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.111.24 కోట్ల నగదును సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అదనపు కలెక్టర్ మోతిలాల్ శుక్రవారం తెలిపారు. 317 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 81,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 9,573 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో కొనుగోలు లక్ష్యం పూర్తికావడంతో మూసి వేసినట్లు వెల్లడించారు.
Similar News
News October 16, 2025
ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ డీపీఆర్ఓగా విష్ణువర్ధన్

ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా ఎల్చల విష్ణువర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజార్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌర సంబంధాల విభాగం పనితీరు మరింత ప్రభావవంతంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు.
News October 16, 2025
ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి: ADB SP

ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాసేవలో అమరులైన జిల్లా పోలీసుల జ్ఞాపకార్థం పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అక్టోబర్ 21న ఫ్లాగ్ డే ఉంటుందన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, పట్టణంలో సైకిల్ ర్యాలీ, 24న 5కే రన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
News October 16, 2025
ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.