News February 4, 2025
MNCL: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
మంచిర్యాల రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 25 ఏళ్లుంటుందన్నారు. నలుపు టీ షర్ట్, యాష్ రంగు ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. చేతిపై మామ అని టాటూ ఉందని జీఆర్పీ SI మహేందర్, హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News February 5, 2025
నిర్మల్: గల్ఫ్ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఇదే..!
గల్ఫ్ బాధితులకు సహాయాన్ని అందించేందుకై జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ బాధితుల కోసం, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసేందుకు జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యులు 9398421883 నంబరులో సంప్రదించి తమ సమస్యలను తెలపాలన్నారు.
News February 5, 2025
మెదక్: రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం జిల్లా క్రీడాకారులు
మెదక్ జిల్లాకు చెందిన రగ్బీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్17 సెమీ కాంటాక్ట్ రబీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. వెండి పతకం సాధించిన రగ్బీ క్రీడాకారులను మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కర్ణం గణేశ్ రవికుమార్ అభినందించారు.
News February 5, 2025
పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య: ASF CI
పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఆసిఫాబాద్ మండలం బొందగూడలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య(55) పదెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట దిగుబడి రాకపోవడంతో రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.