News February 13, 2025

MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తుతెలియని రైలు కింద పడి అటకపురం రాజలింగు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నూరు మండలంలోని అక్కెపల్లి గ్రామానికి చెందిన మృతుడు కుమ్మరి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ వెల్లడించారు.

Similar News

News November 21, 2025

టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్

image

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటివరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి. పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తు చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకూ TET తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 17,883 మంది టీచర్లూ టెట్‌కు అప్లై చేశారు. అయితే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలైనందున తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందని టీచర్లు ఆశిస్తున్నారు.

News November 21, 2025

పల్నాడు వీరుల ఉత్సవాలలో నేడు మందపోరు

image

పల్నాడు వీరుల ఉత్సవాలలో మూడో రోజు శుక్రవారం మందపోరు నిర్వహించనున్నారు. మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నల్లమల మండాది ప్రాంతంలో ఆవులను మేపేవారు. కుట్రతో నాగమ్మ వర్గీయులు ఆవులను వధిస్తారు. ఆవులు రక్షించుకునేందుకు లంకన్న భీకర యుద్ధం చేసి వీర మరణం పొందుతాడు. దీంతో బ్రహ్మనాయుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. నాడు కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు చేపట్టిన చాప కూడు సిద్ధాంతం నేటికీ కొనసాగుతోంది.

News November 21, 2025

నాగార్జునసాగర్-శ్రీశైలం వెళ్తున్నారా?.. మీ కోసమే

image

నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ శనివారం సాగర్ జలాశయం నుంచి కృష్ణా నదిలో నల్లమల అటవీ అందాల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలను అధికారులు ప్రకటించారు. వన్ వే ప్రయాణం పెద్దలకు రూ.2 వేలు, 5 – 10 పిల్లలకు రూ.1600లుగా ధర నిర్ణయించారు.