News February 2, 2025

MNCL: రోజూ 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి: CMD

image

పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతిరోజు 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ CMD బలరాం ఆదేశించారు. శనివారం అన్ని ఏరియాల GMలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోజుకు 11రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలన్నారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Similar News

News December 13, 2025

వేములవాడ: మార్కెట్ ఛైర్మన్‌పై దాడి.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు: SP

image

వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నాగాయపల్లికి చెందిన గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేష్‌లపై ఈ మేరకు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, గోపు మధును ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు.

News December 13, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. నిషేధాజ్ఞలు అమలు

image

గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈనెల 14న జరిగే మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 13, 2025

రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

image

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.