News April 2, 2025
MNCL: వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనలో సింగరేణి సత్తా

సింగరేణి సంస్థ ప్రతి ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ.. దానిని సాధిస్తూ మిగతా ఉత్పత్తి సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అదే కోవలో 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి మరోసారి తన సత్తాను చాటుకుంది. ఇదే స్ఫూర్తితో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై యాజమాన్యం దృష్టి సారించింది.
Similar News
News October 15, 2025
మహిళల అభ్యున్నతికి ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రాజెక్ట్ అధికారి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎన్ఆర్సీ, నాయకపోడు మాస్కుల తయారీ కేంద్రం, గిరిజన భవనం, గిరి బజార్లను పరిశీలించారు. ఐటీడీఏ భవనాలలో గిరిజన మహిళలకు సంక్షేమ పథకాలు, కల్చరల్ పెయింటింగ్, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
News October 15, 2025
TU: ప్రశాంతంగా ముగిసిన ఎంఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని M.Ed రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విద్యార్థులు ఒక్కరు మినహా మిగతా విద్యార్థులు అన్ని పరీక్షలకు హాజరయ్యారన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదని వెల్లడించారు. బుధవారం జరిగిన పరీక్షలకు 29 మంది హాజరైనట్లు తెలిపారు.
News October 15, 2025
వారం రోజుల తర్వాత తెరుచుకోనున్న కురుపాం పాఠశాల

కురుపాం గురుకులానికి జాండీస్ కలకలం కారణంగా వారం రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించడంతోపాటు పదుల సంఖ్యలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రాభాకర్ రెడ్డి స్కూళుకు వారం రోజులు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. సెలువులు ముగియడంతో రేపటి నుంచి(గురువారం) పాఠశాల తెరుచుకోనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.