News January 29, 2025
MNCL: ‘విద్యార్థుల భవిష్యత్తుపై మాదకద్రవ్యాలప్రభావాన్ని నియంత్రించాలి’

విద్యార్థుల భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
Similar News
News December 2, 2025
ఈజీ మనీ ఆశ ప్రమాదం: వరంగల్ పోలీసుల హెచ్చరిక

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని వరంగల్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్స్, భారీ డిస్కౌంట్స్ పేరుతో ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఉచితం అనగానే ఆశపడకుండా ఒక్క క్షణం ఆలోచించాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచించారు.
News December 2, 2025
ఏలూరు: ‘గృహ నిర్మాణానికి దరఖాస్తు పొడిగింపు’

ఏలూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణ దరఖాస్తుకు గడువు పొడిగించడం జరిగిందని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆవాస్ ప్లస్ 2024 సర్వే పూర్తి చేయడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అదనంగా డిసెంబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించడం జరిగిందన్నారు. స్థలం ఉండి ఇల్లు లేని వారు, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 2, 2025
తిరుపతి: కోనలో ఇరుక్కుపోయిన భక్తులు

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని బత్తినయ్య కోనకు వెళ్లిన కొందరు భక్తులు చిక్కుకుపోయారు. బత్తినయ్య కోనలోని భక్తకంటేశ్వర స్వామి దర్శనానికి సోమవారం భక్తులు వెళ్లారు. ఇవాళ ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. భారీ వర్షాలతో కోనకు సమీపంలోని వాగుకు వరద పోటెత్తింది. అటవీ ప్రాంతం నుంచి వేరే దారి ఉన్నప్పటికీ స్థానికేతరులు కావడంతో చిక్కుకుపోయారు. ట్రాక్టర్, రోప్ తీసుకుని ఏర్పేడు అధికారులు ఘటన స్థలానికి బయల్దేరారు.


