News January 24, 2025
MNCL: విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి నష్టం

రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయబోతున్న 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌తో మంచిర్యాల ప్రాంతంలో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సింగరేణి ఓసీపీలు, వివిధ పరిశ్రమలతో గాలి కలుషితమైందని పేర్కొన్నారు. ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
వరంగల్: రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సహాయార్థం కలెక్టరేట్లో 1800 425 3424, జీడబ్ల్యూ ఎంసీలో 1800 425 1980 నంబర్లను ఏర్పాటు చేశారు. సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
News October 29, 2025
Swiggy & Zomato: ఒక్కో ఆర్డర్‌పై రూ.100 ఫీజు?

జొమాటో, స్విగ్గీ వినియోగదారులకు భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ.100 -150 వరకు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్ ఫీజు, ప్యాకేజింగ్ ఛార్జెస్, రెయిన్ ఫీజు, అలాగే వీటిపై GSTని వసూలు చేస్తున్నాయి. వీటికి బదులు ఇకపై ఒకే ఛార్జ్‌ను వసూలు చేస్తాయని వార్తలొస్తున్నాయి. దీనిపై సంస్థలు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
News October 29, 2025
HYD: ట్రాఫిక్ పోలీసులే చలించి పోతున్నారు.. మీకు పట్టవా?

గ్రేటర్ HYDలో అనేక చోట్ల రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారి కష్టాలను చూసి చిలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు స్వయాన తమకు తోచిన సేవ అందిస్తూ రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే పనిని నెత్తిమీద వేసుకుంటున్నారు. వాహనదారుల కష్టాలకు పోలీసులే చలించిపోతున్నారు. మరీ జీహెచ్ఎంసీ సార్లు.. మీకు ఈ బాధలు పట్టవా? అని ప్రజలు అడుగుతున్నారు.


