News January 24, 2025

MNCL: విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి నష్టం

image

రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయబోతున్న 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌తో మంచిర్యాల ప్రాంతంలో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సింగరేణి ఓసీపీలు, వివిధ పరిశ్రమలతో గాలి కలుషితమైందని పేర్కొన్నారు. ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2025

ఓటములే గుణపాఠాలు: విక్రాంత్

image

విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జ్ఞానం కోసం చదివినట్లయితే ఒత్తిడి అనేది ఉండదని యాక్టర్ విక్రాంత్ మాస్సే అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ లో నటి భూమి పెడ్నేకర్‌తో కలిసి పరీక్షల అనుభవాల్ని స్టూడెంట్స్‌తో పంచుకున్నారు. ఓటములనేవి జీవితంలో భాగమని వాటినుంచే మనం అధికంగా నేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమకంటూ స్వంత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించేలా కృషి చేయాలన్నారు.

News February 16, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మనదే హవా

image

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు టీమ్ ఇండియాపైనే ఉంది. మన జట్టు ఇప్పటివరకు 18 విజయాలు తన ఖాతాలో జమ చేసుకుంది. ట్రోఫీ చరిత్రలోనే భారత్ నిలకడైన జట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత శ్రీలంక (14), ఇంగ్లండ్ (14), వెస్టిండీస్ (13), ఆస్ట్రేలియా (12), న్యూజిలాండ్ (12), సౌతాఫ్రికా (12), పాకిస్థాన్ (12) ఉన్నాయి.

News February 16, 2025

బోనకల్: గుండెపోటుతో నిద్రలోనే యువకుడు కన్నుమూత

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బోనకల్‌ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కలకోటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తోకచిచ్చు నిహార్ రాత్రి అన్నం తిని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి వాంతి చేసుకున్నట్లు ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిహార్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి పెద్ద కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

error: Content is protected !!