News February 24, 2025
MNCL: వేలాల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తున్నట్లు మంచిర్యాల డిపో మేనేజర్ జనార్దన్ తెలిపారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు నిర్దేశిత బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతించనున్నట్లు వెల్లడించారు. వివరాల కోసం 9959226004, 832-802-1517 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News November 28, 2025
గంగాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇల్లంతకుంట వాసి మృతి

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 28, 2025
MBNR: ‘టీ-పోల్’ యాప్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టీ-పోల్’ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని వివరించారు.
News November 28, 2025
సాలూరు: మంత్రి పీఏ రాజీనామా

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఏ సతీష్ తన పదవికి రాజీనామా చేశాడు. ఇటీవల తనపై వస్తున్న ఆరోపణలు బాధాకరమని, కావాలనే తనపై కుట్రలు పన్నారని రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. ఏ రోజూ మంత్రి పేరు చెప్పుకొని లబ్ధి పొందేందుకు ప్రయత్నించలేదన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పాడు.


