News February 1, 2025

MNCL: శేష జీవితాన్ని ఆనందంగా గడపాలి: CP

image

పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను CPశ్రీనివాస్ సత్కరించారు. అనంతరం జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. CP మాట్లాడుతూ.. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందన్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందజేయాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News February 7, 2025

అమెరికాలో 487 మంది భారత అక్రమ వలసదారులు: MEA

image

అనుమతి లేకుండా తమ దేశంలో ప్రవేశించిన 104 మంది భారతీయులను అమెరికా ఇటీవల తిరిగి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ బహిష్కరణ తుది జాబితాలో మొత్తం 487 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. సంకెళ్ల అంశంపై అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామన్నారు.

News February 7, 2025

KTRకు అంతర్జాతీయ ఆహ్వానం

image

TG: మాజీ మంత్రి KTRకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. IBC-2025 సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించాలని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. పదేళ్ల BRS పాలనలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం అద్భుతమని ప్రశంసించింది. HYDను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని, తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి స్ఫూర్తిదాయకమని అభినందించింది.

News February 7, 2025

అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాలు, స్టాక్ పాయింట్ల ద్వారా స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌లు స‌జావుగా జ‌రిగేలా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో పనిచేయాల‌ని అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప‌ర్యావ‌ర‌ణ‌, ఇత‌ర అనుమ‌తుల ఆధారంగా త‌వ్వ‌కాలు జ‌రిగేలా, స‌ర‌ఫ‌రాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు.

error: Content is protected !!